చాన్నాళ్ళక్రితం

సభకు నమస్కారం

Posted in బోణీ, Uncategorized by devarapalli on January 8, 2009

locomotive_1_md

సభకు నమస్కారం!
ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ వర్డ్ ప్రెస్ వారి బ్లాగును ఇన్నాళ్ళకి పట్టాలెక్కించా.కూడల్లోనో,జల్లెడలొనో అలా నాలుగు బ్లాగులు చూసొద్దాం అనివెళ్ళామా వర్డుప్రెసులో బ్లాగుపెట్టుము,వర్డుప్రెసులో బ్లాగుపెట్టుము,వర్డుప్రెసులో బ్లాగుపెట్టుము,…. ఇదీ వరస.ఎన్ని సార్లు చెప్పించుకుంటామసలు వాడి చేత?
అసలుమనం మొదట బ్లాగు మొదలు పెట్టిందే వర్డ్ ప్రెస్ లో తర్వాత బ్లాగరు వాడు బామ్మర్దులకన్నా ఎక్కువయ్యాడు.
బ్లాగరులో మాత్రం తక్కువా??రెండు ఆంగ్లబ్లాగులు సుమారొక సంవత్శరం ఈడ్చినాక వాటి దెవసం చేసా..తర్వాత మెల్లగా తెలుగుబ్లాగులు.ఇక్కడా మనం రాయటం కన్నా చదవటం ఎక్కువ,తరచూ చెయ్యి చేసుకోవటం కామెంట్లరూపంలో.
మళ్ళా మధ్యలో కొన్ని తెలుగు బ్లాగరు బ్లాగులు పెట్టటం మధ్యలోనే ఆపెయ్యటం కొన్ని పూర్తిగా డిలిట్ చెయ్యటం ఇదీవరస.
ఈ బ్లాగు మాత్రం అచ్చంగా అనుభవాలు,జ్ఞాపకాలు.అల్లరిచిల్లరపనులు,ఇలాంటి వాటికోసం మొదలేసా.
ఎవరిమీదా ప్రమాణం చెయ్యకపోయినా ఇక్కడ నేను చెప్పుకొచ్చేవి అన్నీ నిజాలే…దాదాపు.
కాకపొతే వీలున్నంతవరకూ పేర్లు చెప్పకుండానే కధ నడిపిద్దాం,స్ఫూర్తిదాయకమైన సంఘటనలలో మాత్రం వారిని మరొక్కసారి స్మరించుకుందాం.

Advertisement

2 Responses

Subscribe to comments with RSS.

  1. రాజేంద్ర గారు, మీ అనుభవాలు, జ్ఞాపకాలు, అల్లరి చిల్లరి పనులను తెలుసుకోవడానికి మేమూ రెడీ. ఆ రాసేదేదో మీదైన ప్రత్యేకమైన భాషలో అక్కడక్కడ రుచి చూపిస్తే ఇంకా సరదాగా ఉంటుందండీ.

  2. devarapalli said, on January 9, 2009 at 11:12 am

    ధన్యవాదాలు నల్లమోతు శ్రీధర్ గారు, అనుభవాలు, జ్ఞాపకాలు, అల్లరి చిల్లరి పనులందరికీ ఉండేవేలేండి,కాకపోతే కాస్తాటూ ఇటూ అంతే :)
    ఈ బ్లాగుకు మొదటి వ్యాఖ్యాత మీరే :)


Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Connecting to %s

Follow

Get every new post delivered to your Inbox.