కొత్త సత్యనారాయణ చౌదరి

నా అనుభవాలుకాసిని నెమరు వేసుకునే ముందు అసలు మా ఊరి వారిలో కొందరిని ఇక్కడ పరిచయం చేస్తా.అంటే కాసిని లింకులు ఇస్తానన్నమాట
.మొదటగా విలక్షణమైన వ్యక్తిగా సాహితీవేత్తగా సుప్రసిద్ధులైన కొత్త సత్యనారాయణ చౌదరి గారి గురించి కాసిని లంకెలు.ఈ లంకెల్లో కొత్త సత్యనారాయణ చౌదరి గారి గురించిన సమాచారం సమస్తం దొరుకుతుంది.పైగా వీటిలో ఉన్న ఎన్నో అరుదైన ఛాయాచిత్రాలు వాటిలో గజారోహణం,తుమ్మల సీతారామ్మూర్తి,లంకపల్లి బుల్లయ్య,మద్ది గోపాలకృష్ణారెడ్డి,యన్,జి,రంగా,కొత్త సత్యనారాయణ చౌదరి గారి కుటుంబసభ్యులు,ఇలా చాలా చూడొచ్చు,అప్పటి విఖ్యాతులైన కవిపండితుల కవితాఖండికలు అలరిస్తాయి.
http://kamalkotha.blogspot.com/2008/04/sata-jayanti-sabhalu-kalaprapurna-kotha.html<
సభకు నమస్కారం

సభకు నమస్కారం!
ఎప్పటినుంచో అనుకుంటున్న ఈ వర్డ్ ప్రెస్ వారి బ్లాగును ఇన్నాళ్ళకి పట్టాలెక్కించా.కూడల్లోనో,జల్లెడలొనో అలా నాలుగు బ్లాగులు చూసొద్దాం అనివెళ్ళామా వర్డుప్రెసులో బ్లాగుపెట్టుము,వర్డుప్రెసులో బ్లాగుపెట్టుము,వర్డుప్రెసులో బ్లాగుపెట్టుము,…. ఇదీ వరస.ఎన్ని సార్లు చెప్పించుకుంటామసలు వాడి చేత?
అసలుమనం మొదట బ్లాగు మొదలు పెట్టిందే వర్డ్ ప్రెస్ లో తర్వాత బ్లాగరు వాడు బామ్మర్దులకన్నా ఎక్కువయ్యాడు.
బ్లాగరులో మాత్రం తక్కువా??రెండు ఆంగ్లబ్లాగులు సుమారొక సంవత్శరం ఈడ్చినాక వాటి దెవసం చేసా..తర్వాత మెల్లగా తెలుగుబ్లాగులు.ఇక్కడా మనం రాయటం కన్నా చదవటం ఎక్కువ,తరచూ చెయ్యి చేసుకోవటం కామెంట్లరూపంలో.
మళ్ళా మధ్యలో కొన్ని తెలుగు బ్లాగరు బ్లాగులు పెట్టటం మధ్యలోనే ఆపెయ్యటం కొన్ని పూర్తిగా డిలిట్ చెయ్యటం ఇదీవరస.
ఈ బ్లాగు మాత్రం అచ్చంగా అనుభవాలు,జ్ఞాపకాలు.అల్లరిచిల్లరపనులు,ఇలాంటి వాటికోసం మొదలేసా.
ఎవరిమీదా ప్రమాణం చెయ్యకపోయినా ఇక్కడ నేను చెప్పుకొచ్చేవి అన్నీ నిజాలే…దాదాపు.
కాకపొతే వీలున్నంతవరకూ పేర్లు చెప్పకుండానే కధ నడిపిద్దాం,స్ఫూర్తిదాయకమైన సంఘటనలలో మాత్రం వారిని మరొక్కసారి స్మరించుకుందాం.
Hello world!
Welcome to WordPress.com. This is your first post. Edit or delete it and start blogging!
leave a comment